![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -395 లో.... కాంచన దగ్గరికి దశరథ్ వెళ్లి డాక్టర్ ని పిలిపించి ట్రీట్ మెంట్ ఇప్పిస్తాడు. నేను అసలు చెల్లి దగ్గర ఉండకుండా వెళ్ళిపోయానని అనసూయ బాధపడుతుంటే.. నేనే నిన్ను వెళ్ళమన్నాను కదా అని కాంచన అంటుంది. మరొకవైపు జ్యోత్స్నని కార్తీక్ తీసుకొని ఇంటికి వెళ్తాడు. కాంచన పడిన విషయం చెప్పి, జ్యోత్స్న మీకు చెప్పకుండా చేసిందని కార్తీక్ తో దీప చెప్తుంది.
దాంతో కార్తీక్ వెంటనే దశరథ్ కి వీడియో కాల్ చేస్తాడు. మావయ్య అమ్మకి ఎలా ఉందని అడుగుతాడు. బాగుంది రా అని కాంచనని చూపిస్తాడు. నాకు బానే మీరు రాకండి అని కాంచన అంటుంది. ఆ తర్వాత దశరథ్ బయటకు వెళ్లి కార్తీక్ తో మాట్లాడతాడు. నా కూతురు చేసిన తప్పుకి క్షమించురా దశరథ్ అనగానే.. మీరు ఎందుకు అలా చెప్తున్నారని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత నా కూతురిని దీపలా నువ్వే మార్చాలిరా అని దశరథ్ అనగానే అది జరగదు ఎందుకంటే దీపనే నీ కూతురు అని కార్తీక్ అంటాడు. ఏం అంటున్నావని దశరథ్ అనగానే కార్తీక్ డైవర్ట్ చేస్తాడు.
నా కూతురికి నువ్వే బుద్ది చెప్పాలని దశరథ్ రిక్వెస్ట్ చేస్తాడు. ఆ తర్వాత రాత్రి అందరు భోజనం చేస్తుంటే.. దశరథ్ కి కార్తీక్ థాంక్స్ చెప్తాడు. ఎందుకని అని శివన్నారాయణ అడుగుతాడు. మా అమ్మని కాపాడాడని జరిగింది చెప్తాడు కార్తీక్. జ్యోత్స్న చేసిన తప్పుకి శివన్నారాయణ తనపై కోప్పడతాడు. జ్యోత్స్న చేత దీపకి సారీ చెప్పిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |